కృష్ణం రాజు నటించిన సినిమాల్లో బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, ధర్మాత్ముడు, కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులు లాంటివి మంచి విజయాన్ని అందుకున్నాయి. కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులు 10రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు. కటకటాల రుద్రయ్య అప్పట్లోనే రూ.75 లక్షల గ్రాస్ వసూల్ చేసి ఇండస్ట్రీలో రికార్డు నెలకొల్పింది.