కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. తెలుగునాట క్షత్రీయ రాజుల వంశస్తులు అయిన విజయనగర సామ్రాజ్యం వారసులుగా కృష్ణంరాజు పేరుపొందారు. కృష్ణంరాజు జీవిత భాగస్వామి పేరు శ్యామలా దేవి. 1996లో నవంబరు 21వ తేదిన కృష్ణంరాజు, శ్యామలా దేవి పెళ్లి జరిగింది. వీరికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి అనే ముగ్గురు కుమార్తెలున్నారు. కృష్ణంరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రభాస్.