పల్లవి:
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
తోడనుకో నీ వాడనుకో
తోడనుకో నీ వాడనుకో
చరణం 1:
నేనేంటి?? నాకింతటి విలువేంటి??
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి??
నీకేంటి?? నువు చేసిన తప్పేంటి??
ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి??
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా
అది కధే కదా మన కధ నిజం కాదా
అది కధే కదా మన కధ నిజం కాదా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
తోడనుకో నీ వాడనుకో
చరణం 2:
ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నాకెన్నెన్నో జన్మలకూ కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడూ
అది నువ్వే కదా నేను నువ్వే కదా
అది నువ్వే కదా నేను నువ్వే కదా
నువు రాయివి కావూ గంగవు కావూ
నే రాముడు శివుడూ కానే కానూ
ఏమనుకోనూ నిన్నేమనుకోనూ
తోడనుకో నీ వాడనుకో