కృష్ణంరాజుది తనది 50 ఏళ్ల స్నేహమని, కృష్ణంరాజంటే తనకు చాలా ఇష్టమని సూపర్ స్టార్ కృష్ణం తెలిపారు. కృష్ణంరాజు మరణవార్త విని ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తేనె మనసులు సినిమా ఆడిషన్స్ కు ఇద్దరం కలిసి వెళ్లామని ఆ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తెలిపారు. ఎన్నో సినిమాల్లో కృష్ణంరాజు తనకు విలన్ గా నటించారని, ఆ తర్వాత హీరోగానూ సత్తా చాటాడని గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.