రెబల్ స్టార్ కృష్ణం రాజు అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యతో హాస్పిటల్‌లో ఉండటం.. నిన్న ప్రభాస్ హాస్పిటల్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఇంత అకస్మాత్తుగా కృష్ణంరాజు మరణిస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇవాళ ఉదయం సడెన్‌గా ఆయన మరణించారన్న వార్త బయటకు రావడంతో టాలీవుడ్ అవాక్కైంది. టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 83 సంవత్సరాల వయసులో ఆయన కాలం చేశారు.
పెద్ద దిక్కును కోల్పోయాను అంటూ పెద్దనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పించి, ప్రభాస్ ను పరామర్శించగా తాను పెద్ద దిక్కును కోల్పోయానంటూ పెద్దనాన్నను గుర్తుచేసుకుంటూ ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో మంత్రి తలసాని ప్రభాస్ ను ఓదార్చారు. కాగా, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని తదితరులు నివాళి అర్పించారు.