కృష్ణంరాజు 16 ఏళ్ల క్రితం తాను ఎలా చనిపోవాలనుకున్నారో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. పచ్చని చెట్టు నీడలో కూర్చుని, తన జీవితంలో ఎవ్వరికీ అన్యాయం చేయలేదని గుండెలమీద చేయి వేసుకుని ఆకాశం వంక చూస్తూ చనిపోవాలనుకున్నట్లు తెలియజేశారు. తనకు అలా చనిపోవాలని ముందే ఇంటర్య్యూలో కృష్ణంరాజు చెప్పడంతో ప్రస్తుతం ఆయన మాటల్ని పలువురు షేర్ చేస్తున్నారు. కాగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కృష్ణంరాజు పార్దీవదేహాన్ని చూడటానికి అభిమానులు భారీగా తరలి వస్తున్నారు.