కృష్ణంరాజు కొన్ని సినిమాలను తీయాలనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. భక్త కన్నప్ప, మన ఊరి పాండవులు సినిమాలను ప్రభాస్ హీరోగా తన డైరెక్షన్ లో రీమేక్ చేద్దామనుకున్నారు. అలాగే 'ఒక్క అడుగు' పేరుతో ఓ స్టోరీ సిద్ధం చేశారు. కానీ ఆ సినిమా కూడా చేయలేదు. 'విశాల నేత్రాలు' నవల ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. ఆ కల కూడా నెరవేరలేదు. గవర్నర్ గా పనిచేయాలనుకున్నారు. అదీ జరగలేదు.