ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్. ఎన్టీఆర్ లలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారనే అంశంపై డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ షోలో యాంకర్ సుమ ప్రశ్నించగా.. ఏ ఒక్కరికో ఎక్కువో, తక్కువో న్యాయం చేస్తే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. నేను సమ న్యాయం చేశా' అని పేర్కొన్నాడు. అలాగే విజయేంద్రప్రసాద్, కీరవాణిలను తప్పించి మూవీలు తీసే అవకాశముందా? అని అడగ్గా, అది అసాధ్యమని పేర్కొన్నాడు.