రెబెల్‌స్టార్ కృష్ణం రాజు గురించి సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆదివారం ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారిలో ఎవరికి పచ్చకామెర్లు వచ్చినా, కృష్ణంరాజు స్వయంగా పసరు మందు పంపే వారని గుర్తు చేసుకున్నారు. వంశపారంపర్యంగా వారి కుటుంబం పసరు మందు చేసిందని, దానిని కృష్ణంరాజు కొనసాగించారని పేర్కొన్నారు. అలా వైద్యం కూడా అందించిన ఘనత ఆయనకు సొంతమని అన్నారు.
![]() |
![]() |