టాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ తీవ్ర విమర్శలు చేశారు. “మనసు లేకపోయినా ఓకే, కనీసం ఒక చావుకి విలువ ఇవ్వాలి కదా. కృష్ణంరాజులాంటి మహా నటుడు చనిపోతే 2 రోజులు షూటింగ్ లు ఆపలేరా. స్వార్దపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు. డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుందని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది”. అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆర్జీవీ వ్యాఖ్యలు సరైనవేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.