సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు నుండే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ విషయంపై ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న తమన్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చారు. SSMB జర్నీ స్టార్ట్స్ టుడే ... అంటూ తమన్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేసారు.
అతడు, ఖలేజా వంటి ఐకానిక్ సినిమాల తదుపరి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన లో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పోతే, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 28, 2023లో ఈ సినిమా విడుదల కాబోతుంది.