రెజీనా కస్సాoడ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం "శాకినీడాకిని". సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్ లో శాకినీడాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు 'మేజర్' అడవి శేష్, ఫిమేల్ డైరెక్టర్ నందినిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు.
సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి సురేష్ బాబు, సునీతా తాటి, హ్యుంవూ థామస్ కిమ్ నిర్మించారు.