టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నుండి ఇటీవలే విడుదలైన చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ". జూలై 29వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఈ వారంలోనే ఓటిటి లోకి అడుగు పెట్టబోతోంది. ఈ మేరకు ఈ చిత్రం తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలలో సెప్టెంబర్ 15వ తేదీ నుండి ప్రఖ్యాత ఓటిటి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు.