ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి 67 : విజయ్ ను ఢీకొట్టేందుకు బాలీవుడ్ సీనియర్ హీరో...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 04:52 PM

"మాస్టర్" కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. అదేనండి... కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది. ప్రస్తుతం వారసుడు షూటింగ్ లో ఉన్న విజయ్ అది పూర్తి అయిన వెంటనే ఈ మూవీని స్టార్ట్ చేస్తారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో విజయ్ ను ఢీకొట్టే పవర్ఫుల్ రోల్ లో నటింపజేసేందుకు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ తో చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఆయనే ఖచ్చితంగా ఈ సినిమాలో విలన్గా నటిస్తారని అంటున్నారు. KGF 2 లో అధీరా గా అదిరిపోయే నటనను కనబరిచిన సంజయ్ తలపతి సినిమాలో విలన్గా నటిస్తున్నాడని తెలిసే సరికి ఫ్యాన్స్ చాలా ఎక్జయిటింగ్ గా ఫీల్ అవుతున్నారు. మరి, ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే, ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa