మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇటీవలే తన అక్కచెల్లెళ్ళతో కలిసి వీకెండ్ ట్రిప్ కెళ్ళొచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి ఇంకా తగ్గకముందే చెర్రీకి సంబంధించిన మరొక లేటెస్ట్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
రాంచరణ్ సిస్టర్ శ్రీజ పెద్ద కూతురు నివృత్తి ముంబైలో చదువుకుంటుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ముంబై వెళ్లిన చెర్రీ నివృత్తికి ఒక మాట కూడా చెప్పకుండా ఆమె స్కూల్ కి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నిజానికి ఈ సర్ప్రైజ్ నివృత్తికి కాదు ఆమె క్లాస్ మేట్స్ అండ్ స్కూల్ స్టాఫ్ కి అని అనుకోవచ్చన్నమాటే. అక్కడికి వెళ్లిన చరణ్ కొంచెంసేపు నివృత్తి ఫ్రెండ్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ తో కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
![]() |
![]() |