కృష్ణంరాజు గురించి కీలక విషయం చెప్పిన మంచు విష్ణు తాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో దాసరి తర్వాత అత్యంత ప్రేమించి, పెద్దరికంగా చూసింది కృష్ణంరాజునే అని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆయన ఓరోజు ఫోన్ చేసి 'రేయ్ ఈసారి మా ఎన్నికల్లో నువ్వు నిలబడుతున్నావు' అని చెప్పారని, తన తండ్రి మోహన్ బాబు వద్దన్నా పట్టుబట్టి ఆయన పోటీ చేయించారని తెలిపారు. మా పనులపై ప్రతినెలా 10వ తేదీన రిపోర్టు ఇస్తామని, ఈసారి కలుద్దామని సిద్ధమయ్యే లోపు ఆయన లేరని సంతాప సభలో విచారం వ్యక్తం చేశారు.