ప్రోమోతో ధుమ్ము రేపిన "గాడ్ ఫాదర్" ఫస్ట్ సింగిల్ 'తార్ మార్ తక్కర్ మార్' పూర్తి లిరికల్ వీడియో ఈ రోజు రాత్రి 07:02 గంటలకు విడుదల కాబోతుంది. తమన్ స్వరపరిచిన ఈ పాటను శ్రేయా ఘోషల్ అండ్ టీం ఆలపించారు.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్న ఈ మూవీ అక్టోబర్ ఐదవ తేదీన దసరా కానుకగా విడుదల కాబోతుంది.