ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న "ది ఘోస్ట్" మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే వేగం అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటికల్ సాంగ్ గా ఉన్న ఈ పాటను భరత్ సౌరభ్ కంపోజ్ చెయ్యగా కపిల్ కపిలన్, రమ్య బెహరా కలిసి ఆలపించారు. కృష్ణ మదినేని సాహిత్యమందించారు. పోతే, ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో రేపు సాయంత్రం 04:05 గంటలకు విడుదల కానుంది.
నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను సర్ప్రైజ్ థ్రిల్ చెయ్యడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
![]() |
![]() |