మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శ్రీసింహా లేటెస్ట్ గా మరొక విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
శ్రీసింహ హీరోగా, కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కించిన చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". ఈ మూవీ ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. తెలుగులో తెరకెక్కిన తొలి సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇక ట్రైలర్ విషయానికొచ్చేటప్పటికి, చూస్తున్నంతసేపు చెమటలు పట్టించింది. ఒక ఆకతాయి దొంగతనంగా కారు డోర్ ఓపెన్ చెయ్యడం, అందులో ఉన్న డబ్బు తీసి బ్యాగ్ లో పెట్టుకోవడం, ఆపై అనుకోకుండా కార్ డోర్ లాక్ అవ్వడం, దొంగ చేసే శత ప్రయత్నాలు, సడెన్ గా విలన్ ఫోన్ చెయ్యడం... ట్రైలర్ మొత్తం ఒకే థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఆసక్తికరంగా సాగింది.
పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.