ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "నచ్చింది గర్ల్ ఫ్రెండూ". గురు పవన్ ఈ సినిమాకు రచయిత - దర్శకుడు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎర్ర తోలుపిల్ల అనే సాంగ్ కు సంబంధించిన పూర్తి వీడియోను రేపు మధ్యాహ్నం 01:45 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విశేషమేంటంటే, ఈ పాటను టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ గారు విడుదల చెయ్యబోతున్నారు.
శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు గిఫ్టన్ ఇలియాస్ సంగీతం అందించారు.