మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళం సినిమా 'లూసీఫర్'కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటించిన స్పెషల్ సాంగ్ ఆడియోని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లో రిలీజ్ కానుంది.