అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన చిత్రం "బ్రహ్మాస్త్ర". సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచుకున్నప్పటికీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్ నెంబర్స్ ను రాబడుతుంది.
అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీలో నిజానికి టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా నటించాల్సి ఉందంట. కానీ, బ్రహ్మాస్త్ర ఆఫర్ కు సుధీర్ కావాలని నో చెప్పారట.
అంత పెద్ద ఆఫర్ ను సుధీర్ బాబుకు ఎలా వదులుకోవాలనిపించింది ??అని అనుకుంటున్నారా..!బ్రహ్మాస్త్ర అవకాశం సుధీర్ బాబు వద్దకు 2018లో వచ్చింది. ఆ సమయంలో సుధీర్ "సమ్మోహనం" సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నారు. అందుకనే బ్రహ్మాస్త్ర కు నో చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ బాబే AAGMC మూవీ ప్రమోషన్స్ లో చెప్పారు.
సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రేపే థియేటర్లకు రాబోతుంది.