దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయం అవుతున్న కొత్త హీరో అభిరాం. దగ్గుబాటి రానా తమ్ముడే అభిరాం. క్రియేటివ్ డైరెక్టర్ తేజ డైరెక్షన్లో "అహింస" అనే సినిమాలో అభిరాం హీరోగా నటిస్తున్నాడు. ఇందులో గీతికా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి ఈ రోజు వరసగా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అదికూడా విభిన్నరీతిలో. హీరో, హీరోయిన్, కీలక పాత్రధారుల పేర్లను, వారికీ సంబంధించిన చిన్న డైలాగ్ ఆడియో క్లిప్స్ ను విడుదల చేస్తూ వచ్చారు. ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. RP పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.