నందమూరి నటసింహం కెరీర్ లో 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టర్కీలో జరుగుతుంది.
ఈ మూవీ టైటిల్ పై ఎప్పటి నుండో వివిధ రకాల ప్రచారాలున్నాయి. అన్నగారు, రెడ్డిగారు, జై బాలయ్య ...ఇలాంటి ప్రచారంలో ఉన్న పవర్ఫుల్ టైటిల్స్ కు నందమూరి అభిమానుల నుండి విశేష స్పందన వస్తుంది. కానీ, మేకర్స్ నుండి ఇప్పటివరకు టైటిల్ పై క్లారిటీ అనేది రాలేదు. లేటెస్ట్ గా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ అఫీషియల్ గా జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి, దసరా రోజున బాలయ్య అభిమానులకు ఎలాంటి ఫెస్టివ్ ట్రీట్ ఇస్తాడనేది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.