తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సినీ కార్మికులకు వేతనాలను పెంచుతూ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లు గురువారం ఓ ప్రకటనను విడుదల చేశాయి. పెద్ద సినిమాలకు పనిచేసే కార్మికులకు 30 శాతం మేర వేతనాలు, చిన్న సినిమాలకు పనిచేసే కార్మికులకు 15 శాతం వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించాయి. 2025 జూన్ 30 వరకు ఇవి అమలులో ఉండనున్నాయి.