టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో లేటెస్ట్ రైజింగ్ హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకామె. అయితే కృతి శెట్టి ఇండస్ట్రీ లోకి తన మొదట సినిమాగా మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో చేసిన “ఉప్పెన” చిత్రంతో భారీ హిట్ అందుకుని టాలీవుడ్ లో ఓ హాట్ కేక్ లా మారింది. మరి అక్కడ నుంచి మరిన్ని బిగ్ ఆఫర్స్ అందుకుంటూ సినిమాలు చేస్తూ తాను వచ్చింది.ఇక ఇదిలా ఉండగా ఈరోజు ఆమె నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తో ముందుకు రాగా నిన్న రాత్రి తన ట్విట్టర్ లో ఆడియెన్స్ తో ఇంట్రాక్ట్ కాగా అందులో ఒకో హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలా మెగా హీరో పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి తాను కూడా మీ అందరిలానే మెగా ఫ్యాన్ నే అంటూ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈమె ఆల్రెడీ రామ్ చరణ్ కి అయితే పెద్ద ఫ్యాన్ ని కూడా ఆల్రెడీ తెలిపింది. మొత్తానికి అలా ఇపుడు మెగా ఫ్యాన్ లా మారిందని చెప్పాలి.