ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రోట్టింగ్ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయమే పడుతుంది. కానీ రోజురోజుకూ ఈ సినిమాపై వచ్చే ఇంట్రెస్టింగ్ వార్తలకు మాత్రం హద్దు లేకుండా పోతుంది. లేటెస్ట్ గా ఒక ఎక్జయిటింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అదేంటంటే, రాజమౌళి తో RRR కు పని చేసిన ఆలియానే SSMB 29 కోసం మరోసారి జక్కన్నతో చేతులు కలుపుతుందని ఆయన తెలిపారు. అంతేకాక ఈ న్యూస్ అఫీషియల్ అని, ప్రస్తుతం గర్భిణీ ఐన ఆలియా ప్రసవం తదుపరి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు.