ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీపై బ్లాస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 11:48 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే ఎఫ్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి, సూపర్ హిట్ అందుకున్నాడు. ఐతే ఈ మూవీ క్రెడిట్ వెంకటేష్, తమన్నా లతో కలిసి వరుణ్ పంచుకున్నాడు. అంతకుముందు వరుణ్ సోలో హీరోగా నటించిన గని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.
దీంతో ఇప్పుడు వరుణ్ సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తన 13వ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 19వ తేదీన ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుందని ఒక వీడియో ద్వారా తెలిపారు.
వీడియోను బట్టి ఈ మూవీ విమానయాన రంగానికి సంబంధించిన సినిమా అయి ఉండొచ్చని తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa