కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నుండి ఇటీవల విడుదలైన 'డాన్' మూవీ తెలుగు, తమిళ భాషలలో సూపర్ హిట్ అయ్యింది. తదుపరి తెలుగు డైరెక్టర్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయం పక్కన పెడితే, ఒక స్కూల్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'డాన్' సినిమాలో ఉన్న కొరియన్ కామెడీ సీన్ గురించి ఆయన మాట్లాడుతూ... తనకు కొరియన్ నటీనటులందరూ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుందని, ఒక్కోసారి ఎవరు హీరో, ఎవరు హీరోయిన్ అని చెప్పడం కూడా కష్టమవుతుంది... అని చెప్పారు.
చిన్న పిల్లల సమక్షంలో శివ కార్తికేయన్ చేసిన ఈ వ్యాఖ్యలు వారిలో జాత్యహంకారాన్ని ఉసిగొల్పేలా ఉన్నాయని, శివ కార్తికేయన్ పబ్లిక్ సెన్సిటైజషన్ వర్క్ షాప్స్ లో పాల్గొనాల్సిన అవసరం ఉందని కొంతమంది నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు