అల్లు అరవింద్ గారి "ఆహా" ఓటిటిలో బాలయ్య హోస్ట్ చేసిన "అన్ స్టాపబుల్" టాక్ షోకు త్వరలోనే సీజన్ 2 రాబోతుందని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులతో సహా ఆడియన్స్ ఈ షో కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన ఈ షో అత్యధిక వ్యూలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాలయ్యబాబు వాక్చాతుర్యం, షోకు విచ్చేసిన ప్రముఖ సెలెబ్రిటీల క్రేజ్ కారణంగా ఈ షో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి, IMDB రేటింగ్స్ లో స్థానం సంపాదించుకుంది.
దెబ్బకు థింకింగ్ మారిపోవాలా... అనే హ్యాష్ ట్యాగ్ తో అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారని టాక్. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.