ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సంస్థ చేతికి 'గాడ్ ఫాదర్' హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 12:32 PM

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియో రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ప్రెజెన్స్ హిందీలో ఈ సినిమా పట్ల ప్రత్యేక అంచనాలను ఏర్పరిచింది.
ప్రఖ్యాత హిందీ డిస్టిబ్యూషన్ సంస్థ సూపర్ క్లస్టర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాడ్ ఫాదర్ హిందీ హక్కులను చేజిక్కించుకుని, ఉత్తరాదిన పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆ సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, బిజూ మీనన్, పూరి జగన్నాధ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన ఈ మూవీ హిందీ, తెలుగు భాషలలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com