టాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వి వి వినాయక్ దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ హోదాను అనుభవించి, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి సైలెంట్ గా ఉన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తెలుగు బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న వినాయక్ లేటెస్ట్ గా హీరోగా నటిస్తూ ఒక మూవీని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వినికిడి. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు, నిర్మాత కూడాను.
2019లో వినాయక్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో "శీనయ్య" అనే సినిమా ఎనౌన్స్మెంట్ జరిగింది. కొన్నాళ్ళు షూటింగ్ కూడా జరుపుకున్న ఈ మూవీ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇందుకు గల కారణాలు కూడా ఇప్పటివరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఇప్పుడు మరోసారి వినాయక్ హీరోగా నటిస్తున్నాడనే వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.