ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారికి హీరో దుల్కర్ సల్మాన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నింట్లలో తనపై వ్యక్తిగతంగా అసభ్యకర, కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిని గుర్తుంచుకున్నట్లు తెలిపారు. వాటిని స్క్రీన్ షాట్లు తీస్తున్నానని, తరచూ వాటిని చూస్తూ ఉంటానని పేర్కొన్నారు.