కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్ గా మారాడు. కేజీయఫ్ లాంటి భారీ హిట్స్ తర్వాత యష్ చేసే నెక్స్ట్ సినిమా ఏది అనే దానిపై కూడా చాలా ఆసక్తి అందరిలో పెరగగా ఇంకా అయితే యష్ ఎలాంటి ప్రాజెక్ట్ కి కూడా ఓకే చేసినట్టు కనిపించలేదు. అయితే తన లైనప్ విషయంలో మాత్రం కొన్ని రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. వాటిలో ప్రశాంత్ నీల్ తో కేజీయఫ్ చాప్టర్ 3 కూడా ఉండగా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో కూడా ఓ సినిమా ఉందని టాక్ ఉంది.
అయితే ఇప్పుడు దీనిపై అయితే కోలీవుడ్ సినీ వర్గాల నుంచి క్రేజీ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఏకంగా వెయ్యి కోట్ల మాసివ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తన్నారట. మరి ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ లలో దిగ్గజ ఓటిటి నెట్ ఫ్లిక్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా భారీ పాన్ ఇండియా సినిమాలు తీసే ధర్మ ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ వారు కూడా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని ఇప్పుడు క్రేజీ బజ్ వినిపిస్తుంది.