కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుండి ఇటీవలే 'తిరుచిత్రంబలం' (తెలుగులో తిరు) అనే సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.
ప్రస్తుతం తిరుచిత్రంబలం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ధనుష్ త్వరలోనే 'కెప్టెన్ మిల్లర్' సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి రివ్యూస్ అందుకుంది.
ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు ఇవ్వబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. పోతే, ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.