సందీప్ కిషన్ తెలుగులో గట్టి హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. కానీ ఈ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ "మైఖేల్" షూటింగ్ లో బిజీగా ఉన్న సందీప్ ఈ సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్నాడు.
ఈ విషయం పక్కన పెడితే, సందీప్ తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలి సినిమా 'మానగరం' లో సందీపే హీరో.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సందీప్ ఒక స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నాడని టాక్. అదికూడా తెలుగులో కాదు... తమిళంలో... ధనుష్ అప్ కమింగ్ మూవీ 'కెప్టెన్ మిల్లర్' లో సందీప్ కీ రోల్ ప్లే చెయ్యనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. చూడాలి మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో.
![]() |
![]() |