అక్కినేని ప్రిన్స్ అఖిల్ నుండి రాబోతున్న కొత్త చిత్రం "ఏజెంట్". ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై ఆసక్తికర అప్డేట్స్ కోసం అక్కినేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంటరెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే, డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ డేట్ ఉండొచ్చని అంటున్నారు. అదే రోజు విజయ్ దేవరకొండ - సమంతల ఖుషి సినిమా విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసుకుంది. కానీ, నిర్మాతల సమ్మె, ఇంకా మరికొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. దీంతో విడుదల తేదీ కూడా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇదే గనక జరిగితే, ఆ రోజున ఏజెంట్ రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఖుషి మూవీ పోస్ట్ పోన్ కాకుంటే, ఏజెంట్ రాక వచ్చే ఏడాదే... అని ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa