మను, రాహు, ఏకం సినిమాలలో హీరోగా నటించిన అభిరాం వర్మ నటిస్తున్న కొత్త చిత్రం "నీతో". ఈ సినిమాకు బాలు శర్మ దర్శకుడు కాగా సాత్వికా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవల విడుదలైన సీతారామం సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసారు. వివాహానికి ఇన్సూరెన్స్ అనే విభిన్న కధాంశంతో తెరకెక్కిన ఈ మూవీ, లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
మిలియన్ డ్రీమ్స్, పృథ్వి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై AVR స్వామి, కీర్తన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.