కన్నడ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న "కబ్జ" మూవీ టీజర్ శనివారం విడుదలైన విషయం తెలిసిందే. పవర్ఫుల్ కంటెంట్ తో, అంతకుమించి అద్భుతమైన విజువల్స్ తో, నటీనటుల స్టన్నింగ్ పెర్ఫార్మన్సెస్ తో ఈ టీజర్ దేశవ్యాప్త ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎంతలా అంటే 24 గంటల్లో ఈ టీజర్ కు యూట్యూబులో 10 మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ టీజర్ కు 15 మిలియన్ వ్యూస్, 455కే లైక్స్ రాగా, యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతుంది.
R చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై R చంద్ర శేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో వచ్చే ఏడాదిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
![]() |
![]() |