హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రం గురించి తెలియజేశాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో హను సినిమా ప్లాన్ చేస్తున్నారని, హిందూ ముస్లీం జంట ప్రేమకథ నేపథ్యంలోనే ఆ సినిమా కథ ఉంటుందని తెలిపాడు. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే మూవీని హీరో నానితో చేయనున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం నాని 'దసరా' సినిమా చేస్తున్నాడు.