మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "జిన్నా". షూటింగ్ అంతిమదశలో ఉన్న ఈ మూవీ మెల్లిగా ప్రమోషన్స్ ను కూడా జరుపుకుంటుంది.
టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుండి లేటెస్ట్ గా సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. గోలీసోడా అనే ఈ అప్ బీటింగ్ సాంగ్ పెప్పి మ్యూజిక్ తో మంచి పార్టీ సాంగ్ లా ఉంది. ఈ పాటను అనూప్ రూబెన్స్ స్వరపరచగా, నాకాష్ అజీజ్, నూతన మోహన్ ఆలపించారు. ఈ పాటకు లిరిక్స్ బాలాజీ అందించగా, ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేసారు.
ఇషాన్ సూర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. సన్నీలియోన్ మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదలవబోతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.