హీరోయిన్ రష్మిక మరో బంపరాఫర్ కొట్టేసిందని సమాచారం. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు నిర్మిస్తున్న ఆషికి 3 సినిమాకు రష్మిక హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. ఆషికీ సినిమా 1990లో వచ్చింది. ఇందులో రాహుల్ రాయ్, అనుఅగర్వాల్ జంటగా నటించారు. 2013లో ఆషికీ 2 ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా వచ్చింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ఆషికీ 3 రాబోతుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో కాగా రష్మిక హీరోయిన్ గా నటించనుంది. దీంతో బాలీవుడ్ లో రష్మిక పేరు మారుమోగుతుంది.