పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ సినిమాలలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ఆపై డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా మారి సినిమాలు చేసారు.
లేటెస్ట్ గా యాక్టర్ గా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యబోతున్నట్టు అఫీషియల్ గా ధృవీకరించారు. మాస్ రాజా రవితేజ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "టైగర్ నాగేశ్వరరావు" లో 'హేమలత లవణం' అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో రేణు నటించబోతున్నట్టు ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కంఫర్మ్ చేసారు.
ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.