టాలీవుడ్ ఇండస్ట్రీకి అజయ్ కతుర్వర్ అనే మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. అజయ్ కతుర్వర్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'అజయ్ గాడు'. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ చూస్తుంటే, ఈ మూవీ పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్టు తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది.
పోతే, ఈ సినిమాలో భానుశ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశేషమేంటంటే, ఈ సినిమాకు నలుగురు సంగీతం దర్శకులు పనిచేస్తున్నారు. అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ కతుర్వర్, చందన కొప్పిశెట్టి నిర్మిస్తున్నారు.