సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఇటీవలే విడుదలైన చిత్రం "సర్కారువారిపాట". కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ మూవీని పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసారు.
ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. మంచి ధియేటర్ రన్ ను పూర్తి చేసుకుని ఆపై డిజిటల్ లో కూడా సత్తా చాటిన ఈ మూవీ లేటెస్ట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి కూడా సిద్ధమైంది.
ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 25వ తేదీన సాయంత్ర ఆరు గంటలకు ప్రముఖ స్టార్ మా ఛానెల్ లో సర్కారోడి సందడి మొదలుకానుంది.