టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుని ఉత్తరాదికి వెళ్లిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి కాలం సరిగా కలిసి రావట్లేదు. హిందీలో వరస పెట్టి సినిమాలు చేస్తున్నా ఏది కూడా ఆమెకు మంచు గుర్తింపును తీసుకురావట్లేదు. ఆయుష్మాన్ ఖురానాతో రకుల్ ప్రీత్ కలిసి నటిస్తున్న డాక్టర్ G తోనైనా బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించాలని రకుల్ డైహార్డ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 14వ తేదీన ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో అనుభూతి కశ్యప్ డైరెక్టర్ గా సినీ ఎంట్రీ ఇస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తుంది.