మెగా హీరో వరుణ్ తేజ్ తన 13వ సినిమా వివరాలను సోమవారం ప్రకటించాడు. ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ ఒక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
