టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలే కాకుండా అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నారు. తాజాగా, ప్రముఖ మెన్స్ వేర్ బ్రాండ్ ఒట్టో కోసం మోడల్ అవతారం ఎత్తారు. ఒట్లో దుస్తులు, యాక్సెసరీస్ ధరించి మోడలింగ్ సెషన్ లో పాల్గొన్నాడు.ఇటీవల బాగా స్లిమ్ గా తయారైన మహేశ్ ఒట్టో ట్రెండీ కాజువల్స్ లో సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. టీషర్టు, బ్లూ జీన్స్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, రిస్ట్ బ్యాండ్లతో నవతరం ప్రతినిధిగా దర్శనమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.