సీతారామం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.
R. బాల్కి డైరెక్షన్లో విభిన్న కథాకథనాలతో తెరకెక్కిన 'చుప్ : ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్' సినిమాలో దుల్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై క్రిటిక్స్ షాకింగ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ దుల్కర్ ఈ సినిమాలో ఇచ్చాడట. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దుల్కర్ క్రేజ్ మరింత పెరుగుతుందని, ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేష ప్రశంశలు వస్తాయని అంటున్నారు.
పోతే, ఈ సినిమాలో సన్నీ డియోల్, పూజా భట్, శ్రేయా ధన్వంతరి కీలకపాత్రలు పోషిస్తున్నారు.