టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కెఎస్ రవీంద్ర తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో 154వ సినిమా కావడంతో ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. రీమేక్ కాదు డైరెక్ట్ ప్రాజెక్ట్ కావడంతో అందరిలోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ తెలియనుంది. ఇక ఈ షూటింగ్ రేపు రాజమండ్రిలో ప్రారంభం కానుండగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. మెగాస్టార్, మాస్ మహారాజ్ రవితేజ కూడా షూటింగ్‌లో పాల్గొననున్నారు.